Gallery March 18, 2026

తెలంగాణ భాషా దినోత్సవం

హైదరాబాద్ (సెప్టెంబర్ ) రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ పరిధిలో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్్ పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్ 9 సెలవు దినం కారణంగా సెప్టెంబర్ 13 వ తేదీన ఈ వేడుకలు జరపాలని పాఠశాల యాజమాన్యం సూచించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలంగాణ భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, పొడుపు కథలు మొదలైన కార్యక్రమాలతో అందరినీ అలరించారు. కర్ణాటక సంగీత ఉపాధ్యాయునిగా పని చేస్తున్న శ్రీ. శ్రీనివాసచారిగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భాషాపరంగా తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగించిన కాళోజీ నారాయణరావు గురించి తెలియజేయడమే కాక, తన గీతాలాపనతో శ్రోతలందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ. ప్రేమ్ ప్రకాష్ సాహుగారు, శ్రీనివాసచారి గారికి తమ పాఠశాల జ్ఞాపికను ప్రదానం చేశారు.
Admission Assistant
Contact us for admission enquiries - from Nursery to Grade XII +91 79989 20202
Chat on WhatsApp